-
ముందస్తు బెయిల్ ఇవ్వండి: కోర్టులో రేవణ్ణ పిటిషన్
బెంగళూరు: ఒక మహిళ కిడ్నాప్ కేసులో మాజీ మంత్రి హెచ్డి రేవణ్ణ ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేశారు. బెయిల్ కోసం బెంగళూరు సెషన్స్‌కోర్టులో శుక్రవారం(మే3) పిటిషన్ వేశారు. తన తల్లిని రేవణ్ణ ఎత్తుకుపోయారని రేవణ్ణ ఫామ్‌హౌజ్‌లో పనిచేసే యువకుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. బెంగళూరులోని కేఆర్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో రేవణ్ణపై ఎఫ్ఐఆర్ నమోదైంది. కుమారుడు ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక వేధింపుల(సెక్స్ స్కాండల్) వీడియోల కేసులో రేవణ్ణ శుక్రవారం సిట్ ముందుకు రావాల్సి ఉండగా ఆయన గైర్హాజరయ్యారు. -
కేజ్రీవాల్‌కు బెయిల్ పరిశీలిస్తాం: ‘ఈడీ’కి సుప్రీం షాక్
న్యూఢిల్లీ: అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు విషయంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)కి సుప్రీంకోర్టు వరుస షాకులిస్తోంది. లిక్కర్ కేసులో తన అరెస్టు అక్రమమని కేజ్రీవాల్ వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు శుక్రవారం(మే 3) విచారించింది. ఎన్నికలున్న నేపథ్యంలో కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ ఇచ్చే అంశాన్ని తాము పరిశీలిస్తామని, దీనిపై వాదన వినిపించేందుకు సిద్ధమై రావాలని సుప్రీంకోర్టు ఈడీని కోరింది.పిటిషన్‌పై మళ్లీ మంగళవారం విచారణ జరుపుతామని తెలిపింది. ‘మేం కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ ఇవ్వొచ్చు. ఇవ్వకపోవచ్చు. అయితే మధ్యంతర బెయిల్ ఇచ్చే అంశాన్ని మాత్రం పరిశీలిస్తాం. మా నిర్ణయంపై ఎవరూ ఆశ్చర్యపోవద్దు. ఒకవేళ బెయిల్ ఇస్తే ఎలాంటి షరతులు విధించాలన్నది ఈడీ చెప్పాలి. కేజ్రీవాల్ సీఎంగా ఏవైనా ఫైల్స్‌పై సంతకం చేయాల్సి ఉందా అన్నదానిని కూడా ఈడీ పరిశీలించాలి’ అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. కాగా, లిక్కర్ కేసులో కేజ్రీవాల్‌ను అరెస్టు చేసిన సందర్భంపై వివరణ ఇవ్వాలని సుప్రీంకోర్టు ఈడీని ఇప్పటికే ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ అంశంపైనే శుక్రవారం కోర్టు ప్రధానంగా విచారణ జరిపింది. లిక్కర్‌స్కామ్ కేసులో కేజ్రీవాల్‌ను ఈడీ మార్చి 21న అరెస్టు చేసిన విషయం తెలిసిందే. -
అమిత్ షా ఫేక్ వీడియో కేసు.. ఐదుగురికి బెయిల్
సాక్షి,హైదరాబాద్: కేంద్ర హోం మంత్రి అమిత్ షా మార్ఫింగ్ వీడియో పోస్ట్ చేసి అరెస్టయిన ఐదుగురు కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులకు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. టీపీసీసీ సోషల్ మీడియా టీమ్ మెంబర్స్ పెండ్యాల వంశీకృష్ణ, మన్నె సతీష్, నవీన్, ఆస్మా తస్లీమ్, గీతలకు కోర్టు కండిషనల్ బెయిల్ ఇచ్చింది.పది వేల పూచీకత్తుతో కూడిన రెండు ష్యూరిటీలు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు నిందితులు ప్రతీ సోమ, శుక్ర వారాలు కేసు విచారణ అధికారుల ముందు హాజరు కావాలని కోరింది. కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు ఐదుగురు వాట్సాప్‌లో వచ్చిన అమిత్ షా మార్ఫింగ్ వీడియోలను కావాలనే ట్విటర్లో పోస్టు చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. విద్వేషాలను రెచ్చగొట్టి లబ్ధిపొందాలన్న ఉద్దేశంతో ఇలాంటి వీడియోలు పోస్టు చేసినట్లు ప్రాథమికంగా తేలినందున ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. -
మొబైల్ ఫోన్ టార్చ్‌లైట్ వెలుగులో సిజేరియన్: తల్లీ బిడ్డ మృతి
వైద్యుల నిర్లక్ష్యం తల్లీబిడ్డలను బలితీసుకుంది. పురిటి నొప్పులు రావడంతో ప్రసవం కోసం గర్బిణికి చీకట్లో కేవలం మొబైల్ టార్చ్ సాయంతో సిజేరియన్ చేయడంతో ఇద్దరూ చనిపోయిన ఘటన కలకలం రేపింది. దిగ్భ్రాంతికర ఘటన మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఆధ్వర్యంలో నడుస్తున్న ఆస్పత్రిలో చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళ్తే ఖుస్రుద్దీన్ అన్సారీ దివ్యాంగుడు. అతని భార్య షాహిదున్‌కి ఏప్రిల్ 29 సోమవారం ఉదయం పురిటి నొప్పులు రావడంతో కుటుంబసభ్యులు సుష్మా స్వరాజ్ మెటర్నిటీ ఆసుపత్రికి తీసుకొచ్చారు. సాధారణ కాన్పు అవుతుందని చెప్పిన వైద్యులు చివరికి సిజేరియన్ చేయాలంటూ కుటుంబ సభ్యుల అనుమతి తీసుకున్నారు. విద్యుత్ సరఫరా నిలిచిపోయినా జనరేటర్ ఆన్ చేయకుండా మొబైల్ ఫోన్ టార్చ్ వెలుగులోనే సిజేరియన్ చేశారు. దీంతో ఏంజరిగిందో తెలియదు గానీ మొదట శిశువు, ఆ తరువాత తల్లి ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. నిర్లక్ష్యంతోనే తల్లీబిడ్డలను పొట్టనబెట్టుకున్నారని కన్నీరు మున్నీరయ్యారు. రెండు రోజుల పాటు ఆస్పత్రి ఎదుట ఆందోళన చేయడంతో ఎట్టకేలకే దిగి వచ్చిన బీఎంసీ విచారణకు ఆదేశించింది.తన భార్య ఆరోగ్యంగా ఉందనీ,ఎలాంటి సమస్యలు లేవని, మూడు గంటలైనా జనరేటర్ ఆన్ చేయలేదని, సరైన సమయంలో చికిత్స చేయకుండా అన్యాయంగా తల్లీ బిడ్డల్ని పొట్టన బెట్టుకున్నారని బాధితురాలి భర్త అన్సారీ ఆరోపించాడు. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేశాడు. అంతేకాదు తన భార్య మరణం తరువాత కూడా వైద్యులు చీకటిలో మరో ప్రసవం చేశారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. దీనికి సంబంధించిన ఫోటోలను విడుదల చేశారు. కాగా అన్సారీ షాహిదున్‌కు పెళ్లయి ఇంకా ఏడాది కుండా నిండకుండానే తీరని విషాదం చోటు చేసుకుంది. సాధారణ ప్రసవం అవుతుందని చెప్పి ఆరోగ్యంగా ఉన్న తన కోడల్ని చీకట్లోనే ఆపరేషన్ థియేటర్‌కి తీసుకెళ్లి ఫోన్ టార్చ్ సహాయంతో డెలివరీ చేశారని అన్సారీ తల్లి వాపోయింది. బిడ్డ చనిపోయిందని తాము కేకలు వేస్తే.. తల్లి క్షేమంగానే ఉందని, వేరే ఆసుపత్రిలో తీసుకెళ్లిమని చెప్పారు. కానీ అప్పటికే ఆమె చని పోయిందనీ కనీసం ఆక్సిజన్ కూడా అందుబాటులో లేదంటూ ఆమె కనీటి పర్యంతమైంది. -
Prajwal Revanna: ప్రజ్వల్ రేవణ్ణకు ఊహించని షాక్
బెంగళూరు: లోక్‌సభ ఎన్నికల వేళ కర్ణాటక రాజకీయాల్లో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన కర్ణాటక లైంగిక వేధింపుల కేసులో ప్రధాన నిందితుడైన ప్రజ్వల్ రేవణ్ణకు మరో షాక్ తగిలింది. తాజాగా అతడిపై అత్యాచారం కేసు నమోదైంది.వివరాల ప్రకారం.. కర్ణాటకలో సంచనలంగా మారిన ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక వేధింపుల కేసు విషయంలో పోలీసులు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తాజాగా ప్రజ్వల్‌పై అత్యాచారం కేసు నమోదైంది. లైంగిక వేధింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజ్వల్‌పై సిట్ అధికారులు పలు సెక్షన్ల కింద కేసు బుక్ చేశారు. ఐపీసీ సెక్షన్ 376 (బీ) (ఎన్), 506, 354(ఏ)(2), 354(బీ), 354(సీ), ఐటీ చట్టం కింద కేసు ఫైల్ చేశారు. ఈ ఎఫ్ఐఆర్లో ప్రజ్వల్ రేవణ్ణను ఏకైక నిందితుడిగా చేర్చారు. కాగా, ఇది ప్రజ్వల్‌పై నమోదైన రెండో కేసు.ఇదిలా ఉండగా.. ఈ కేసును ప్రత్యేక దర్యాప్తు సంస్థ సిట్ దర్యాప్తు చేపడుతోంది. ఇందులో భాగంగా విచారణకు హాజరవ్వాలని నోటీసులు జారీ చేసింది. 24 గంటల్లోగా ఎస్పీ సీమా లాట్కార్ ముందు హాజరుకావాలని ఆదేశించింది. అయితే, తనకు సమయం కావాలని ప్రజ్వల్ రేవణ్ణ సిట్ అధికారులను కోరారు. Karnataka government's special investigation team (SIT) filed a rape case against Janata Dal (Secular)'s Hassan MP #PrajwalRevanna. This is the second #FIR against Prajwal Revanna, who is also the grandson of JDS chief and former PM HD Deve Gowda.The FIR against JDS' (cont) pic.twitter.com/A6tKUIFsYu— News Daily 24 (@nd24_news) May 3, 2024 ఈ నేపథ్యంలో ప్రజ్వల్ ట్విట్టర్ వేదికగా‘సిట్ ముందు హాజరుకావడానికి ఏడు రోజుల సమయం కావాలి. ఇప్పుడు నేను బెంగళూరులో లేను’ అంటూ ఒక పోస్టు చేశాడు. కాగా, ప్రజ్వల్ అభ్యర్థనను సిట్ తిరస్కరించింది. ఈ మేరకు గురువారం ఉదయం మరోసారి సమన్లు పంపింది. అనంతరం కొద్దిసేపటికే ఆయనపై లుక్ అవుట్ నోటీసులు కూడా జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆయనపై అత్యాచారం కేసు కూడా నమోదు చేసింది.ప్రస్తుతం ప్రజ్వల్ జర్మనీలో ఉన్నట్లు తేలింది. లైంగిక వేధింపుల ఆరోపణలు వెలుగులోకి వచ్చిన వెంటనే ప్రజ్వల్.. డిప్లొమాటిక్ పాస్‌పోర్ట్ ఉపయోగించి ఏప్రిల్ 28న జర్మనీ పారిపోయారు. ఈ క్రమంలో మరోవైపు అతడి పాస్‌పోర్ట్ రద్దు చేసి, ప్రజ్వల్‌ను భారత్‌కు రప్పించటంలో సాయం చేయాలని ప్రధాని మోదీని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కోరారు. మరోవైపు విచారణకు హాజరు కాకపోతే దేశానికి తిరిగి వచ్చిన వెంటనే ప్రజ్వల్‌ను అరెస్ట్ చేసే అవకాశం ఉంది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
KKR vs MI: కేకేఆర్‌తో ముంబై కీలక పోరు.. తుది జట్లు ఇవే
జూనియర్ ఎన్టీఆర్‌ను అణగదొక్కాలని చూస్తున్నారు: కొడాలి నాని
లోక్‌సభ ఎలక్షన్స్ 2024: మూడో దశ పోలింగ్ జరిగేది ఇక్కడే..
రాహుల్‌గాంధీపై అస్సాం సీఎం సంచలన వ్యాఖ్యలు
ఒడిశా, పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రాలకు చల్లని కబురు
అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)
షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు
సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి
ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?
తప్పక చదవండి
- కోర్టు పెండింగ్‌లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్‌తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
- రాయ్‌బరేలీ నుంచి తప్పుకున్న ప్రియాంక.. కారణం అదేనా?
- వేసవిలో ఉసిరి తినడం మంచిదేనా..?
- భయపడకు.. పారిపోకు: రాహుల్‌పై ప్రధాని మోదీ సెటైర్లు
Advertisement